: నాటి జయప్రద హాట్ సాంగ్... నేడిప్పుడు నయా రూపంలో హల్ చల్!


దాదాపు 35 సంవత్సరాల క్రితం జయప్రద డ్యాన్స్ చేసిన ఓ హాట్ సాంగ్ ఇప్పుడు కొత్త రూపంలో నెట్టింట హల్ చల్ చేస్తోంది. 1980లో కృష్ణ, శ్రీదేవి జంటగా వచ్చిన 'చుట్టాలున్నారు జాగ్రత్త' చిత్రాన్ని హిందీలో జితేంద్ర, జయప్రదలతో 'మవాలి' పేరుతో రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'ఓయమ్మ ఓయమ్మ...' పాట అప్పట్లో సూపర్ హిట్. ఇక తాజాగా, సియా ఫర్లర్ అనే ఆస్ట్రేలియా సింగర్, తన కొత్త ఆల్బమ్ 'దిసీజ్ యాక్టింగ్'లో 'చీప్ థ్రిల్స్' అనే పాటను విడుదల చేయగా, ఆ గీతాన్ని 'మవాలి' పాట వీడియోకు రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదలగా, అదిప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది చూసి, జయప్రద అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు.

  • Loading...

More Telugu News