: డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకిచ్చిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు సీజన్ 10లో తొలి ఓటమి ఎదురైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (48 ) డేవిడ్ వార్నర్(49) శుభారంభం ఇచ్చారు. తరువాత దీపక్ హుడా (9) ఆకట్టుకోలేకపోగా, యువరాజ్ సింగ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. బెన్ కటింగ్ (20) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో రాణించగా, హర్భజన్ సింగ్ 2 వికెట్లతో మలింగ, మెక్ క్లెంగన్, హర్డిక్ పాండ్య చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అనంతరం 159 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మన్ పార్థీవ్ పటేల్ (39), కృనాల్ పాండ్య(37), నితీశ్ రాణా (45) రాణించడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.