: నైజీరియాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి... వారం వ్యవధిలోనే 489 మంది మృతి

నైజీరియాలో మెనింజైటిస్ (మెదడు వాపు) వ్యాధి పంజా విసురుతోంది. కేవలం వారంరోజుల వ్యవధిలోనే ఈ వ్యాధితో 489 మంది మృత్యువాత ప‌డ్డారు. మరో 5 వేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. దీంతో నైజీరియాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్ర‌క‌టించారు. దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఈ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ కొరత ఉండ‌డంతో త‌మ దేశంలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. జంపారా, కత్సిన, కెబ్బీ, నైగర్‌, సొకొటో రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు.

More Telugu News