: ‘స్కూప్ వూప్’ సీఈఓపై లైంగిక వేధింపుల కేసు నమోదు
ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల కేసులో స్కూప్ వూప్ సంస్థ కో-ఫౌండర్, సీఈఓ సుపర్ణ్ పాండేపై కేసు నమోదైంది. ఈ సంస్థలో గతంలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగి ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు డీసీపీ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. ఈ సంస్థలో రెండేళ్ల పాటు ఆమె పని చేసిందని, పాండే తరచుగా ఆమెతో సెక్స్ గురించి మాట్లాడుతుండే వాడని, అసభ్య వీడియోలు పంపుతుండేవాడని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించినట్టు చెప్పారు. పలు సెక్షన్ల కింద సుపర్ణ్ పాండేపై కేసు నమోదు చేసినట్టు డీసీసీ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.