: మంచు లక్ష్మి దంపతులతో కలసి తిరుమల మెట్లెక్కిన రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. నేటి తెల్లవారుజామున మెట్ల మార్గంలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి దంపతులతో కలిసి తిరుమల చేరుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను రకుల్ ప్రీత్ అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మంచు లక్ష్మి, ఆమె భర్త ఉన్నారు. అనంతరం నేటి ఉదయం శ్రీవారిని రకుల్, మంచు దంపతులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.