: మోదీ మెచ్చిన సినిమా పోస్టర్ ఇదే...!


ప్రధాని నరేంద్ర మోదీ సందర్భానుసారంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పార్టీకి సంబంధించి లేదా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వినూత్నంగా స్పందిస్తే కూడా ఆయన అభినందిస్తారు. అలాంటి ఘటనే ఇటీవల చోటుచేసుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే సాహూ అనే వ్యక్తి నైనిటాల్ లో అతికించిన ఓ సినిమా పోస్టర్ ను ప్రధానికి ట్యాగ్ చేస్తూ ఒక ఫోటోను పెట్టారు. దానిని చూసిన ప్రధాని మోదీ... 'హహహ.. పరిశుభ్రత గురించి చెప్పేందుకు సినిమా పోస్టర్ ను వాడుకున్నారు....వినూత్నమైన ఆలోచన' అంటూ దానిని రీ ట్వీట్ చేశారు.

ఇంతకీ ఆ పోస్టర్ ఏంటంటే... 80వ దశకంలో సూపర్ హిట్ అయిన బాలీవుడ్ సినిమా 'దీవార్' పోస్టర్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశికపూర్  'తల్లి తనకు కావాలంటే తనకు కావాలని' గొడవ పడుతుంటారు... దానిని ఉద్దేశించి.... తల్లి పాత్రధారి నిరూపా రాయ్.. 'మీ ఇద్దరిలో ఎవరైతే ముందు మరుగుదొడ్డి కట్టిస్తారో... నేను వారి దగ్గరే ఉంటాన'న్న డైలాగ్ ను ఆ పోస్టర్ పై ముద్రించారు. దీంతో స్వచ్ఛభారత్ ను ఈ రకంగా ప్రమోట్ చేయడం పట్ల మోదీ అభినందించారు. కాగా, అమితాబ్ ఫేమస్ డైలాగ్ 'మేరా పాస్ మా హై' ఈ సినిమాలోనిదే కావడం విశేషం!

  • Loading...

More Telugu News