: మమతా బెనర్జీ తలను నరికి తీసుకురండి.. 11 లక్షలు ఇస్తా: బీజేవైఎం నేత తీవ్ర వ్యాఖ్యలు


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగనరికి తీసుకువచ్చిన వారికి రూ. 11 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత యోగేష్ వార్ష్నే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బిర్భమ్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ అనే నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో, ర్యాలీ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

దీంతో, బీజేవైఎం నాయకుడు యోగేష్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమతా బెనర్జీ తలను నరికి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. రామ నవమి, సరస్వతి పూజలాంటి పండుగలను రాష్ట్రంలో జరుపుకోనివ్వడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఇఫ్తార్ పార్టీలను మాత్రం మమత నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత మద్దతు ముస్లింలకేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News