: నేడు ముంబైతో సన్ రైజర్స్ హైదరాబాదు ఢీ... ఆసక్తికరమైన మ్యాచ్!
ఐపీఎల్ సీజన్ 10లో 10వ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను కాపాడుకుంటూ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా సన్ రైజర్స్ హైదరాబాదు తాజా సీజన్ లో ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఈ సీజన్ లో నేటి సాయంత్రం 8 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు తలపడనుంది. రెండు జట్లకు బౌలింగ్ వనరులు అపారంగా ఉన్నాయి.
తాజాగా ఆ జట్టుతో కీలక బౌలర్, ఆ జట్టు తురుపుముక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ నేటి మ్యాచ్ లో ఆడనున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ లో ముంబై ఇండియన్స్ కంటే సన్ రైజర్స్ హైదరాబాదు కాస్త బలంగా కనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాదుదే పై చేయగా కనిపిస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ కూడా దీటుగా స్కోరు చేస్తుండడంతో ఈ మ్యాచ్ అభిమానులను అలరిస్తుందని వెటరన్ లు అభిప్రాయపడుతున్నారు.