: దేశంలో 1.7 కోట్ల పట్టణ ఇళ్లలో వంటగది కూడా లేదు: వెల్లడించిన నివేదిక


దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో నాలుగింట ఒకదాంట్లో ప్రత్యేకంగా వంటగది లేదని సోసియో-ఎకనమిక్ క్యాస్ట్ సెన్సస్ (ఎస్ఈసీసీ) నిదివేక పేర్కొంది. హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎస్ఈసీసీ తాజా సర్వే ప్రకారం దేశంలోని దాదాపు 1.7 కోట్ల పట్టణ ఇళ్లలో ప్రత్యేకంగా వంట గది అనేదే లేదు. ఉన్న ఒకే ఒక్క గదిలోనే వారు వంట చేసుకున్నారు. ఫలితంగా వాయు కాలుష్యం ఏర్పడి వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నట్టు నివేదిక పేర్కొంది.

దీనికి పట్టణాలలో వాహనాల వల్ల విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం కూడా తోడవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిశోధనపై వెలువడే ‘ఎల్సెవీర్’ అనే జర్నల్ తాజా కథనంలో ఢిల్లీలో వాయు కాలుష్యం కంటే వంట గదులే ఎక్కువ కాలుష్య కారకాలుగా మారుతున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సరైన వెంటిలేషన్ లేని కారణంగానే కిచెన్లు ఎక్కువ కాలుష్యమవుతున్నట్టు మరో పరిశోధనలో వెల్లడైంది. ఎస్ఈసీసీ డేటా ప్రకారం.. ఇటువంటి వంటగదులు కలిగిన రాష్ట్రాల్లో మిజోరం మొదటి స్థానంలో ఉండగా, బిహార్ రెండోస్థానంలో ఉంది. డయ్యుడామన్, కేరళలో 90 శాతానికి ప్రత్యేకంగా వంటగదులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News