: ఢిల్లీ ‘మెట్రో’లో కేటీఆర్ తో సెల్ఫీ దిగిన బాల్క సుమన్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడి మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. కేటీఆర్ వెంట ఎంపీలు బాల్క సుమన్, జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో బాల్క సుమన్ ఓ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా బాల్క సుమన్ పోస్ట్ చేశారు.
కాగా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వీకే సింగ్ తో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై ఆయన చర్చించినట్టు సమాచారం. హైదరాబాదులో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు, హైదరాబాద్ లోని కంటోన్మెంట్ రహదారి మూసివేత తదితర అంశాలపై కేటీఆర్ ఆయా మంత్రుల వద్ద ప్రస్తావించారు.