: ప్రతిసారి, చీరలు కట్టాలంటే బోర్ కొట్టేస్తుంది: లావణ్య త్రిపాఠి


గతంలో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నటించిన లావణ్య త్రిపాఠి చీరకట్టులో ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్ తేజ్ ‘మిస్టర్’ చిత్రంలోనూ లావణ్య త్రిపాఠి చీరకట్టులోనే కనపడనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, చీరల్లో అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారని, చీరలు ధరించడమంటే తనకూ చాలా ఇష్టమని చెప్పింది. అయితే, ప్రతిసారి, చీరలు ధరించే పాత్రల్లోనే నటించాలంటే బోర్ కొట్టేస్తుందని, కొంచెం డిఫరెంట్ గా ఉండే పాత్రల్లో నటిస్తుంటే బాగుంటుందని చెప్పింది.

  • Loading...

More Telugu News