: పాకిస్థాన్ కు సుష్మాస్వరాజ్ తీవ్ర హెచ్చరిక!
కుల్ భూషణ్ జాదవ్ విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ కు ఘాటు హెచ్చరిక చేశారు. కుల్ భూషణ్ జాదవ్ ను ఉరితీస్తే...తరువాత చోటుచేసుకునే పరిణామాలకు పాకిస్థాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కుల్ భూషణ్ జాదవ్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని ఆమె తెలిపారు. అకారణంగా ఆయనను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కాగా, కుల్ భూషణ్ జాదవ్ దగ్గర భారత్ పాస్ పోర్టు ఉందని, అతను భారతీయ పౌరుడని, అతని కేసుకు సంబంధించిన వివరాలు భారత్ తో పంచుకోవాల్సి ఉందని భారత్ చెబుతున్న సంగతి తెలిసిందే.