: ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనం: నారా లోకేష్
స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ జయకేతనం ఎగురవేయడం పట్ల ఏపీ మంత్రులు నారా లోకేష్, కిమిడి కళా వెంకట్రావ్ లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు టీడీపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వారు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 37 వార్డులకు ఉపఎన్నికలు జరగ్గా అందులో 21 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుపొందిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, రైతులు, యువత అందరూ టీడీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని తెలిపారు.