: కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించడంపై.. నాగ్ పూర్ లో పాక్ కు వ్యతిరేకంగా ఆందోళనలు


నాగ్ పూర్ లో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాక్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ను గూఢచారిగా ఆరోపిస్తూ అక్కడి సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నిరసనకారులు మండిపడ్డారు. భారత్ ను ధైర్యంగా ఎదుర్కోలేని పాకిస్థాన్... ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులభూషణ్ ను క్షేమంగా భారత్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు జోక్యం చేసుకోవాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News