: ఇకపై ఏపీ సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్ తప్పనిసరి!
ఏపీ సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్ పద్ధతిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాల్సిందేనని పేర్కొంది. కొందరు ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని, సమీక్షలకు హాజరు కావడం లేదని ఏపీ ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డిప్యూటీ సెక్రటరీలు ప్రతిరోజూ హాజరు వివరాలను నమోదు చేయాలని, ప్రతి నెల చివరిలో శాఖల కార్యదర్శులు, సీఎస్ కు అటెండెన్స్ రిపోర్ట్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.