: ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్ర‌యాణిస్తూ మోదీతో సెల్ఫీ తీసుకున్న ఆస్ట్రేలియా ప్ర‌ధాని

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్నబుల్ భార‌త్‌లో ప‌ర్య‌టిస్తోన్న విషయం తెలిసిందే. భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అయ్యేలా త‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ఈ రోజు ఉద‌యం మాట్లాడుతూ తెలిపిన మల్కం టర్నబుల్ ప్ర‌స్తుతం ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశారు. మోదీతో క‌లిసి ఆయ‌న ఢిల్లీలోని మండి హౌస్ మెట్రో స్టేష‌న్‌లో మెట్రో రైలులో కాసేపు ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా మోదీతో క‌లిసి ఆయ‌న సెల్ఫీ తీసుకున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న మోదీతో ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. రేపు ఆస్ట్రేలియా ప్రధాని ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు.

More Telugu News