: ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దినకరన్.. ఈసీపై మండిపడుతున్న శశికళ వర్గం

ఈ నెల 12వ తేదీన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రూ. 100 కోట్ల మేర డబ్బును ఓటర్లకు శశికళ వర్గం పంపిణీ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో... ఉప ఎన్నికను రద్దు చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు శశి వర్గం భారీ ఎత్తున డబ్బులు పంచిందనే విషయం ఐటీ దాడుల్లో కూడా నిర్ధారణ అయింది. దీంతో, ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం నిర్ణయంపై శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని ఆయన మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయనప్పటికీ, ఈసీ అన్యాయమైన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈసీ నిర్ణయంతో శశికళ వర్గీయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు వారు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంతలోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకోవడంతో... వారంతా అవాక్కయ్యారు.

More Telugu News