: నాడు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం సబబే!: పురందేశ్వరి
ఒంటరి జీవితంలో తోడు కావాలని కోరుకున్న ఎన్టీఆర్, నాడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని ఆయన కూతురు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ లో అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ ను చివరి దశలో ఆయన పిల్లలెవ్వరూ పట్టించుకోలేదనే విషయం కరెక్టు కాదని ఆమె అన్నారు.
నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నేడు నడవటం లేదని ఆమె విమర్శించారు. ‘రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు కారు, ఎవరైతే వారి ఆదర్శాలను కొనసాగిస్తారో వారే నిజమైన వారసులు’ అని తన తమ్ముడు బాలకృష్ణ ఒకానొక సమయంలో స్వయంగా చెప్పారని పురందేశ్వరి అన్నారు.