: అందుకే, లోకేష్ ప్రమాణస్వీకారానికి వెళ్లలేదు!: పురందేశ్వరి


నారా లోకేష్ మంత్రి పదవి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి తమను ఎవరూ ఆహ్వానించలేదని బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తమను ఆహ్వానిస్తే వెళ్లేవాళ్లమని, పిలవని పేరంటానికి వెళితే బాగుండదని ఆమె అన్నారు. అయితే, లోకేష్ కు తమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా మోదీ తన పాలనలో సత్తాను చాటుకున్నారని అన్నారు. ఏపీలో పరిపాలన రీత్యా చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘చంద్రబాబుకు మార్కులు వేసే స్థాయి నాకు లేదు. ఆయనకు రాష్ట్ర ప్రజలే మార్కులు వేస్తారు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News