: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి స్వల్ప గాయాలు!
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి స్వల్పగాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం యర్రసాని గూడెంలో మంత్రి ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో గాయపడ్డ మంత్రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, గుర్తు తెలియని ఆ వాహనాన్ని గుర్తించేందుకు విజయవాడ హైవేపై మంత్రి అనుచరులు నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను నిలిపివేశారు. మంత్రి అనుచరులకు పోలీసులు మద్దతు పలకడంతో ట్రాఫిక్ జామ్ అయింది.