: ఢిల్లీలో జర్మన్ పై దాడి... దోపిడీ


మనదేశంలో కూడా విదేశీయులపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు, ఢిల్లీలలో ఇలాంటి దాడులు చేసుకుంటుండడం విశేషం. జర్మనీకి చెందిన బెంజిమన్‌ స్కాట్‌ (19) అనే యువకుడు గత రాత్రి 11గంటల సమయంలో చాందినీ చౌక్‌ నుంచి రిక్షాలో వస్తుండగా కశ్మీర్‌ గేట్‌ వద్ద మరో వ్యక్తి ఆ రిక్షా ఎక్కాడు. కొంత దూరం వెళ్లాక రిక్షా నడిపే వ్యక్తి, రిక్షా ఎక్కిన వ్యక్తితో కలిసి పదునైన ఆయుధంతో బెంజిమన్‌ పై దాడి చేశారు. అనంతరం అతని ఫోన్‌ ను, పర్సును దోచుకుని పారిపోయారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన బెంజిమన్ ను గీతా కాలనీవాసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఘటనపై జర్మన్ ఎంబసీకి సమాచారం అందించామని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News