: రాణించిన స్టోక్స్, తివారీ... పంజాబ్ లక్ష్యం 164
ఐపీఎల్ సీజన్ 10లో ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్ అభిమానులను అలరిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పూణే సూపర్ జెయింట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. ఓపెనర్ అజింక్యా రహానే (19) ఫర్వాలేదనిపించగా, మయాంఖ్ అగర్వాల్ (0) విఫలమయ్యాడు. అనంతరం స్టీవ్ స్మిత్ (26) ఆకట్టుకున్నాడు. బెన్ స్టోక్స్ (50) అర్ధ సెంచరీతో అలరించగా, ధోనీ (5) విఫలమయ్యాడు. మనోజ్ తివారీ (40), క్రిస్టియన్ (17) మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో పూణే జట్టు 150 మార్కును దాటింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో సందీప్ శర్మ రెండు వికెట్లతో రాణించగా, స్టోయిన్స్, నటరాజన్, స్వప్నిల్ సింగ్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో పంజాబ్ లక్ష్యం 164 పరుగులు.