: మోదీ, హసీనాలు పదవి నుంచి దిగిపోవాల్సిందిగా కోరుతున్నానన్న వ్యాఖ్యాత
భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు మోదీ, షేక్ హసీనాలకు ఈ ఉదయం ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరిన తర్వాత... ప్రధానులు ఇద్దరూ ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం, కార్యక్రమ వ్యాఖ్యాత మాట్లాడుతూ, 'ప్రధానులు ఇద్దరూ పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నాను' అన్నాడు. వాస్తవానికి ప్రధానులు ఇద్దరూ ఎలివేటెడ్ పోడియం నుంచి దిగిపోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పాలి. అయితే, వ్యాఖ్యాత కామెంట్ ను అర్థం చేసుకున్న మోదీ, హసీనాలు నవ్వుతూ పోడియం దిగారు. తొందరపాటులో చేసిన పొరపాటు వ్యాఖ్యను సరదాగా తీసుకున్నారు. ఒక నిమిషం పాటు నవ్వుల్లో మునిగిపోయారు.