: 'సమ్మర్ కూల్' అంటున్న జెట్ ఎయిర్ వేస్
ఇప్పటికే ఇండిగో సంస్థ దేశవాళీ రూట్లలో విమాన టికెట్ల ధరను ప్రకటించగా, ఇప్పుడు తాజాగా జెట్ ఎయిర్ వేస్ సైతం అదే దారిలో నడిచింది. 'సమ్మర్ కూల్ ఆఫర్' పేరిట ఎకానమీ క్లాస్ టికెట్లను రూ. 1,294 కే అందించనున్నట్టు తెలిపింది. 9వ తేదీలోగా బుక్ చేసుకునే టికెట్లపై, కనీసం 20 రోజుల తరువాత ప్రయాణానికి తేదీని నిర్ణయించుకోవాల్సి వుంటుందని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ లో భాగంగా ఎకానమీ టికెట్లను ప్రీమియం టికెట్లుగా కూడా అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఈ ఆఫర్ లో భాగంగా ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచామన్న విషయాన్ని మాత్రం జెట్ ఎయిర్ వేస్ వెల్లడించలేదు.