: అమరావతిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మలి దశ భూసేకరణ కోసం ఈ రోజు నోటిఫికేషన్ ను జారీ చేశారు. రాయపూడి పరిధిలోని రెండు విభాగాల్లో 224 ఎకరాలు, తుళ్లూరులో 96 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యంతరాలను తెలియజేయడానికి 60 రోజుల సమయం ఇస్తున్నట్టు నోటిఫికేషన్ లో తెలిపారు. నోటీసు జారీ చేసిన భూములకు సంబంధించి కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించింది.