: బస్సులన్నింటినీ నానీ స్వయంగా ఆర్టీసీకి రాసివ్వాలి: డిమాండ్ చేసిన రవాణా సంఘాలు
ఇదిలావుండగా, ఆర్టీసీ నష్టాలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని ఈ ఉదయం కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ ఎంపీగా ఉంటూ, అక్రమ మార్గంలో ఆయన పర్మిట్ లేని రూట్లలోనూ బస్సులను తిప్పారని, స్టేజ్ కారియర్లుగా నడిపారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. తన బస్సులను ఆయనే స్వయంగా ఆర్టీసీకి అప్పగించాలని, ప్రైవేటు బస్సులను జాతీయం చేయాలని కార్మిక ఏపీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని దివాలా తీయించి సొంత ఆస్తులను పెంచుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.