: ఉత్తరాది అహంకారం కనిపిస్తోంది: పవన్ కల్యాణ్ ఘాటు ట్వీట్స్

బీజేపీ నేత విజయ్ తరుణ్ దక్షిణాది వారు నల్లవారు అన్న వ్యాఖ్యలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేసిన ఆయన... నల్లగా ఉన్నవన్నీ వద్దనుకుంటే కోకిలలను నిషేధించాలని సూచించారు. 'నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవెన్యూ మీకు కావాలి... కానీ వాళ్ల మీద మీకు చిన్నచూపు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వారికి చోటు ఇచ్చే పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండడం మన దౌర్భాగ్యం' అని ఆయన తెలిపారు. ఉత్తరాది అహంకారం మీ మాటల్లోనే కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. మీరు ఎగురవేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూపకల్పనే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

More Telugu News