: త్వరలో రెండు వందల నోట్లు.. బ్యాంకుల ద్వారానే చలామణి!


రెండు వందల రూపాయల నోట్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నోట్ల ముద్రణకు ప్రభుత్వ అనుమతి కోసం ఆర్బీఐ ఎదురు చూస్తోందని సమాచారం. ప్రభుత్వ అనుమతి లభిస్తే ఈ ఏడాది జూన్ నుంచి రూ.200 నోట్లను ఆర్బీఐ ముద్రించనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నోట్లను బ్యాంకుల ద్వారా ఖాతాదారులకు అందించాలనే యోచనలో ఆర్బీఐ ఉంది. ఏటీఎంల ద్వారా ఈ నోట్లను పొందడం కుదరదు. ఎందుకంటే, ఏటీఎంలలోని సాఫ్ట్ వేర్ అందుకు అనుగుణంగా లేదు. అందుకని, ఖాతాదారులకు బ్యాంకుల ద్వారానే రెండు వందల నోట్లను అందించాలనే ఆలోచనలో ఆర్బీఐ ఉందట.

  • Loading...

More Telugu News