: ఈసారి ‘తృణమూల్’ ఎంపీ వంతు.. ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం!
ఎయిర్ ఇండియా సిబ్బందితో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అమర్యాదకరంగా ప్రవర్తించిన సంఘటన ఎన్ని విమర్శలకు దారి తీసిందో తెలుసు. ఈ సంఘటన మరవక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. ఈసారి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) డోలాసేన్ వార్తల్లో నిలిచారు. ఢిల్లీ నుంచి కోల్ కతా వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది.
డోలాసేన్ తన తల్లిని విమాన అత్యవసర ద్వారం వద్ద సీటులో కూర్చోబెట్టారు. అయితే, ఎంపీ తల్లి వృద్ధురాలు కావడంతో ఎమర్జెన్సీ ద్వారం వద్ద సీట్లో కూర్చోవడం కరెక్టు కాదని, మరో సీటు కేటాయిస్తామని సిబ్బంది చెప్పారు. అందుకు, డోలాసేన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఢిల్లీ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన విమానం అరగంట ఆలస్యంగా బయలుదేరింది.