: విజయవాడలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. వృథాగా పోతున్న డీజిల్!


విజయవాడలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వృథాగా పోతున్న డీజిల్ ను స్థానికులు కేన్లలోకి పట్టుకుని తీసుకుపోతున్నారు. స్థానిక నున్న వద్ద ఫ్లై ఓవర్ ఎక్కుతుండగా ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. దీంతో, పొలంలోకి వెళ్లి, ట్యాంకర్ బోల్తా కొట్టింది. డ్రైవర్, క్లీనర్ కు స్వల్పగాయాలయ్యాయి. అయితే, ట్యాంకర్ నుంచి వృథాగా కారిపోతున్న డీజిల్ ను క్యాన్లు, పాత్రల ద్వారా స్థానికులు పట్టుకుపోతున్నారు. కొండపల్లి నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News