: వినోద్ ఖన్నా పరిస్థితి చూసి షాక్ అయ్యా.. ఆయన కోసం నా అవయవాలు దానం చేస్తా: నటుడు ఇర్ఫాన్ ఖాన్
అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరిన వినోద్ ఖన్నా పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, ఆసుపత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. వినోద్ ఖన్నా ఆరోగ్యంపై ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు.
బాలీవుడ్ లో ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలు అత్యంత అందమైన నటులని, వినోద్ సాబ్ ను ఇలాంటి పరిస్థితిలో చూసిన వెంటనే షాక్ కు గురయ్యానని ఇర్ఫాన్ తెలిపాడు. తాను చాలా కలత చెందానని చెప్పాడు. అవసరమైతే వినోద్ సాబ్ కోసం తన అవయవాలు దానం చేయడానికి కూడా తాను సిద్ధమేనని తెలిపాడు.