: వేలంలో ఎవరూ పట్టించుకోని ఇమ్రాన్ తాహిర్ సత్తా చాటుతున్నాడు!
ఐపీఎల్ సీజన్-10లో నిపుణులు, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలేవైనా ఉన్నాయంటే బెన్ స్టోక్స్ 14.5 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడం... వేలంలో ఇమ్రాన్ తాహిర్ ను ఎవరూ కొనుగోలు చేయకపోవడం. వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకున్న తాహిర్ ను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో ఆయన కోట్ చేసిన ధరకు పూణే సూపర్ కింగ్స్ జట్టు చివర్లో సొంతం చేసుకుంది.
దీంతో ఐపీఎల్ సీజన్-10లో ఇమ్రాన్ తాహిర్ ఆడడం సంభవమైంది. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతమైన బంతితో పార్థివ్ పటేల్ (19) ను పెవిలియన్ కు పంపిన తాహిర్... 7వ ఓవర్ 3వ బంతికి రోహిత్ శర్మ (3) ను బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ ఐదవ బంతికి జోస్ బట్లర్ (38) ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. దీంతో తొలి మ్యాచ్ లోని తొలి స్పెల్ లోనే తాహిర్ ఖాతాలో 3 వికెట్లు వచ్చి చేరాయి. దీంతో పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు 82 పరుగులు చేసింది. క్రీజులో రానా (13), రాయుడు (10) ఉన్నారు.