: కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ యువతులకు వల వేస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాదులోని కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన కూకట్ పల్లిలో ఇద్దరు యువకులు ఎవరూ ఊహించని వృత్తిని ఎంచుకున్నారు. వీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన యువతులకు వలవేస్తారు. వారి వలలో పడిన అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేసి, వారి నుంచి డబ్బులు గుంజుతున్నారు. వారిపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పే యువకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. 

More Telugu News