: 'చెలియా' కోసం ఒకరోజంతా నాకు ఆడిషన్ జరిగింది!: కథానాయిక అదితిరావ్ హైదరి


చెలియా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కార్తీకి మేకప్ వేయలేదని, కార్తీ ఒరిజినల్ గా ఎలా ఉంటాడో అలాగే తీశారని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి రావ్ హైదరి తెలిపింది. తనను ఈ సినిమా ఆడిషన్స్ కోసం చెన్నైలోని మద్రాసు టాకీస్ ఆఫీస్ కు పిలిచారని చెప్పింది. ఆడిషన్ ఒక రోజంతా జరిగిందని చెప్పింది. మద్రాసు టాకీస్ ఆఫీస్ లో తమిళం మాట్లాడమన్నారని చెప్పింది. అయితే తనకు తమిళం తెలియకపోవడంతో జర్మనీ మాట్లాడానని గుర్తుచేసుకుంది. ఆ సాయంత్రం కార్తీ ఆఫీస్ కు వచ్చాడని, అప్పుడు తమ ఇద్దరికీ ఫోటో షూట్ నిర్వహించారని, తరువాత విడివిడిగా ఫోటో షూట్ చేశారని తెలిపింది. అస్సలు మేకప్ వేయలేదని, ఎలా ఉన్నామో అలాగే షూట్ చేశారని చెప్పింది. కార్తీ ఫస్ట్ లుక్ కూడా ఆ రోజు తీసిందేనని చెప్పింది. సినిమాలో వాస్తవికత ఎక్కువని తెలిపింది. 

  • Loading...

More Telugu News