: 1000కి పైగా థియేటర్లలో బాహుబలి-1 విడుదల


బాహుబలి పార్ట్ 1 సినిమాను మ‌రోసారి థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ఆ సినీ యూనిట్ సన్నాహాలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. మరో మూడు వారాల్లో బాహుబలి 2 థియేటర్లలోకి రానున్న నేప‌థ్యంలో బాహుబ‌లి 1ను మ‌రోసారి రీలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే, ఈ పార్ట్‌-1 సినిమాను 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శించ‌నున్నార‌ట‌. ఈ సినిమాకు ప్ర‌ధానంగా హిందీలో ఎక్కువ థియేటర్లు కేటాయించారు. మరోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లోనూ థియేటర్ల సంఖ్య మరింత పెరిగేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో హిట్‌గా దూసుకుపోతున్న సినిమా ఏదీ లేక‌పోవ‌డం బాహుబ‌లికి క‌లిసి వ‌చ్చే అంశంగా మారింది. కాగా బాహుబ‌లి-2 సినిమాను ఈ నెల 28న విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News