: సీటెక్కిన కొత్త మంత్రులు... వెలగపూడిలో సందడి!


చంద్రబాబు మంత్రివర్గంలో కొత్తగా చేరిన పలువురు మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించడంతో వెలగపూడి సచివాలయం ప్రాంతంలో సందడి నెలకొంది. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు, రహదారులు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు, మార్కెటింగ్‌, సహకార, పశుసంవర్థక, మత్స్య, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు శుభాభినందనలు తెలిపారు. నారా లోకేష్ ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదినారాయణ రెడ్డికి ఇంకా చాంబర్ కేటాయించకపోవడంతో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చాంబర్ లో కూర్చుని అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంత త్వరలో అందరు మంత్రులకూ చాంబర్లను కేటాయిస్తామని సచివాలయం అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News