: రవిశాస్త్రి, గంగూలీ మధ్య స్పష్టంగా కనిపించిన విభేదాలు!


టీమిండియా మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, గంగూలీల మధ్య విభేదాలు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. జట్టు కోచ్ ఎంపిక సమయంలో గంగూలీ నేతృత్వంలోని కమిటీ తనను నియమించకుండా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై అప్పట్లో రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, గంగూలీ సైతం దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

ఇక బుధవారం జరిగిన ఐపీఎల్ పోటీల్లో దిగ్గజ క్రికెటర్లయిన సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవిశాస్త్రి వ్యవహరించాడు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ గంగూలీ ముభావంగా నేల చూపులు చూస్తూ ఉండటం గమనార్హం. ఆపై మిగతా ముగ్గురితో రవిశాస్త్రి మాట్లాడుతుండగా, గంగూలీ దూరంగా నిలుచుని కనిపించాడు. దీంతో వీరిద్దరి మధ్యా గొడవలు ఇంకా సద్దుమణగలేదని, ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు.

  • Loading...

More Telugu News