: డొనాల్డ్ ట్రంప్ ను 'ఇడియట్' అన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తొలిసారి వ్యాఖ్యానించారు. ట్రంప్ ను ఏకంగా ఇడియట్ అంటూ తూలనాడారు. ఐసిస్ ప్రతినిధి అబు హసన్ అల్ ముహాజిర్ విడుదల చేసిన వీడియోలో ట్రంప్ గురించి అరబిక్ భాషలో మాట్లాడుతూ, ట్రంప్ కి ఇస్లాం అంటే తెలియదని అన్నాడు. ఇస్లాం గురించి తెలియని ఇడియట్ ట్రంప్ అని పేర్కొన్నాడు. అమెరికా ప్రభుత్వం త్వరలో దివాళా తీస్తుందని, ఇంతవరకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఇమేజ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న విషయం అందరికీ తెలిసిపోయిందని ఈ వీడియోలో అబు హసన్ అల్ ముహాజిర్ పేర్కొన్నాడు. అలా జరగడానికి కారణం ఏంటంటే...ఆ దేశాన్ని ఒక ఇడియట్ అయిన ట్రంప్ పరిపాలించడమేనని ఆయన స్పష్టం చేశాడు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.