: ఫైవ్ స్టార్ హోటల్ ను కాదని, ఆవుల షెడ్లో మకాం వేసిన బీజేపీ నేత!

ఈ నెల 9న జరగనున్న నంజన్ గుడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి, రజాజీ నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్ సురేష్ కుమార్, తనకు బస ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ హోటల్ ను కాదని, ఓ గ్రామంలోని గోశాలలో మకాం వేశారు. గోవులున్న షెడ్లోనే, ఓ దుప్పటి పరచుకుని కూర్చుని అక్కడి నుంచే పర్యటనలు సాగిస్తున్నారు.

యడ్యూరప్ప సీఎంగా ఉన్న వేళ, న్యాయ మంత్రిగా పని చేసిన ఆయన, పార్టీ నేతలు తనకు మైసూరులోని ఓ స్టార్ హోటల్ లో బసను ఏర్పాటు చేసినప్పటికీ, స్వచ్ఛమైన గాలి గోశాలల్లో మాత్రమే లభిస్తుందన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నానని ఆయన అన్నారు. పాఠశాలలు, గోశాలలు తనకు నచ్చుతాయని, గతంలో తిరుపతికి, ధర్మశాలకు, శబరిమలకు కాలినడకన వెళ్లిన సమయాల్లో కూడా తాను బహిరంగ ప్రదేశాల్లోనే మకాం వేసేవాడినని చెప్పారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే, అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు.

More Telugu News