: ఐపీఎల్ కెప్టెన్ల సెల్ఫీ ఇదే!


ఐపీఎల్‌-10వ సీజన్‌ ప్రారంభానికి తెరలేచేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాదులో సంబరాలు నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. దీంతో ఆ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీల కెప్టెన్లంతా హైదరాబాదు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ యాజమాన్యం ఆయా జట్ల సారథులు, ఫ్రాంఛైజీలతో అధికారిక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐపీఎల్‌-10వ సీజన్‌ లోని ఎనిమిది జట్ల కెప్టెన్లంతా భారీ సెల్ఫీ దిగారు. ఈ సెల్పీని గుజరాత్ జట్టు కెప్టెన్ సురేష్ రైనా తీయగా, డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌, రోహిత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌, స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌ వెల్‌ పోజిచ్చారు. ఈ సెల్ఫీని ఐపీఎల్ నిర్వాహకులు అభిమానులతో పంచుకున్నారు. 

  • Loading...

More Telugu News