: బొజ్జలను బుజ్జగించేందుకు వెళ్లిన గంటా శ్రీనివాస్, సీఎం రమేష్ లకు చేదు అనుభవం?


ఏపీ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని టీడీపీ సీనియర్ నేతలు అలక బూనగా, పదవులు కోల్పోయిన నేతలూ మండి పడుతున్నారు. ఏపీ అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జలను బుజ్జగించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత సీఎం రమేష్ వెళ్లాలని చంద్రబాబు సూచించడం తెలిసిందే.

బొజ్జలను బుచ్చగించేందుకు వెళ్లిన ఆ ఇద్దరు నేతలకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. బొజ్జల భార్య వారిపై మాటలతో విరుచుకుపడ్డారట. అనారోగ్యం సాకు చెప్పి తన భర్తను తప్పిస్తారా? చంద్రబాబుకు ఎటువంటి అనారోగ్యం లేదా? తన భర్తకు అన్యాయం చేస్తారా? అంటూ ఆమె మండిపడ్డారట. దీంతో, సీఎం రమేష్ కంగు తిన్నారట. తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరతామని, లేకపోతే, శ్రీకాళహస్తిలో స్వతంత్రంగానే పోటీ చేస్తామని బొజ్జల సతీమణి తెగేసి చెప్పారట. వెంటనే, గంటా శ్రీనివాసరావు కలుగ జేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందట.

  • Loading...

More Telugu News