: భారత్‌లో ‘వాట్సప్‌’ ద్వారా నగదురహిత లావాదేవీలు!


భారతీయులు వాట్సప్‌ను ఎంత‌గా వాడుతున్నారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్కర్లేదు. అయితే, డిజిట‌ల్ చెల్లింపుల‌కు కూడా అదే వాట్స‌ప్‌ను వాడితే ఎలా ఉంటుంది? ప్రచారం అవసరం లేకుండానే ఈ విష‌యం గురించి వాట్స‌ప్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిపోతుంది. త్వరలోనే అలాంటి సదుపాయం వాట్సప్‌లో చూడ‌వ‌చ్చు. ప్రపంచంలోనే మొద‌టిసారిగా భారత్‌లో ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టాల‌ని వాట్స‌ప్ ప్ర‌తినిధులు చూస్తున్నారు. మరో ఆరునెల్లోనే చెల్లింపుల సేవలను వాట్సప్ లో చూడ‌వ‌చ్చ‌ని స‌మాచారం. వాట్సప్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించి ఓ ఉద్యోగ ప్రకటనను కూడా ఉంచారు. భారత్‌లో ‘డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ లీడ్‌’ పోస్టు భర్తీ కోసం దర‌ఖాస్తులు చేసుకోవాల‌ని వాట్స‌ప్ కోరుతోంది. ఇందుకోసం భార‌త్‌లోని యూపీఐ, భీమ్‌ యాప్‌, ఆధార్‌ నంబర్‌ వ్యవస్థల గురించి మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News