: హైదరాబాదును తడిపేసిన వరుణుడు!


హైదరాబాదు నగరాన్ని పగలంతా సూర్యుడు మండిస్తే.... సాయంత్రమయ్యేసరికి హైదరాబాదీలు తేరుకునేలా వరుణుడు చల్లబరిచాడు. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతున్నారు. పగలంతా ప్రచండ భానుడు సెగలుకక్కుతుండడంతో ఇల్లు దాటాలంటే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదును చిన్న జల్లుతో పలకరించిన వరుణుడు, ఈ సాయంత్రం హైదరాబాదు నగరాన్ని వర్షంతో ముంచెత్తాడు. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. వర్షంతో పాటు చల్లగాలులు కూడా వీయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. 

  • Loading...

More Telugu News