: కొడుకుకి ప్రామిస్ చేశాడు... ప్రపంచ రికార్డు నెలకొల్పాడు!!
కుమారుడికి ప్రామిస్ చేసిన ఓ వ్యక్తి...ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఇటలీలోని ఫ్లోరెన్స్ పట్టణంలో నీటి బుడగల కళాకారుడు స్టెఫానీ రెఘీ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచంలో అంత్యంత బలహీనమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి నీటి బుడగలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అంత్యంత బలహీనమైన నీటి బుడగలను ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు స్టెఫానీ ఎంపిక చేసుకున్నాడు. నలభై బుడగలను వరుసగా పేర్చి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు 2011 లో 21 బుడగలతో ఒక వ్యక్తి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, దానిని బద్దలు కొట్టిన స్టెఫానీ రెఘీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.