: మలాలాకు మరో అరుదైన గౌరవం.. కెనడా పార్లమెంటులో ప్రసంగం
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(19) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 12న కెనడా పార్లమెంటులో ఆమె ప్రసంగించనుంది. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు స్వయంగా తెలిపారు. ఆ రోజు ఆమెకు గౌరవ పూర్వకమైన సిటిజన్‌షిప్ కూడా అందించనున్నట్లు చెప్పారు. తమ పార్లమెంటులో ప్రసంగించనున్న అతి పిన్న వయస్కురాలు మలాలేనని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో బాలికల విద్యను ప్రోత్సహిస్తుందనే కారణంతో గతంలో మలాలాపై తాలిబన్లు కాల్పులు జరపడంతో మొదట పాక్‌లోనే చికిత్స పొందిన మలాలా అనంతరం బ్రిటన్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. 2014లో భారతీయుడు కైలాశ్ సత్యార్థితో కలిసి మలాలా నోబెల్ అవార్డు అందుకుంది. ఆ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు కూడా మలాలానే.