: గవాస్కర్, కపిల్ దేవ్, శ్రీకాంత్ దిగ్గజాలతో 'టేస్ట్ మ్యాచ్'... ఆటగాళ్లు వాళ్లే మైదానం మారింది!


టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, క్రిష్ శ్రీకాంత్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, హార్డిక్ పాండ్య, మిథాలీ రాజ్, జులన్ గో స్వామి.. వీరంతా టీమిండియాకు ఆడినవారే... కానీ మైదానం మారుతోంది. ప్రముఖ మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఒక టీవీ షో నిర్వహించనున్నాడు. ఈ టీవీ షో పేరు 'టేస్ట్ మ్యాచ్' అని పెట్టారు. ఈ 'టేస్ట్ మ్యాచ్' లో టీమిండియా ఆటగాళ్లు గరిటె చేతపట్టనున్నారు. తమకు చేతనైన వంటకాలు సందీప్ పాటిల్ షో కోసం చేయనున్నారు. భారత్ తరపున ఆడిన ఆటగాళ్లంతా పాల్గోననున్న ఈ 'టేస్ట్ మ్యాచ్' షోకు వ్యాఖ్యాతగా సందీప్ పాటిల్ వ్యవహరించనున్నాడు. ఇందుకోసం ఆ టీవీ ఛానెల్ రూపొందించిన ప్రొమో ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News