: కేటీఆర్ తాత పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది: ఎమ్మెల్యే సంపత్
కేటీఆర్ తాత పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని, అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే జాతి కేసీఆర్ కుటుంబానిదని ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పిన నేతలంతా చరిత్రలో కలిసిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని, ఆయన కుటుంబానికి నాలుగు పదవులు వచ్చాయని, ఈ విషయాన్ని కేటీఆర్ మర్చిపోవద్దని అన్నారు. తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని కేటీఆర్ డబ్బులు దండుకున్నారని ఆరోపించారు.