: రాజీనామా లీకులిస్తూ మభ్యపెడుతున్న చంద్రబాబు: నిప్పులు చెరిగిన వైవీ సుబ్బారెడ్డి


తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టి చేర్చుకుని, మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు వారంతా రాజీనామాలు చేశారని మీడియాకు లీకులిస్తూ, ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వారు లేఖలను అందించిన తరువాతే గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారని తమకు అనుకూలమైన దినపత్రికల్లో చంద్రబాబు వార్తలు రాయించుకున్నారని విమర్శించారు. వారి రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయని చెప్పుకుంటున్నారని, అదే వాస్తవమైతే, రాజీనామాలు చేసిన రోజే ఎందుకు ప్రకటన వెలువడలేదని ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నరే, ఈ దుర్మార్గపు చర్యకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళతామని, ఈ విషయమై ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News