: డొల్ల కంపెనీల గుట్టురట్టు చేస్తున్న ఈడీ.. ఇద్దరి అరెస్ట్.. అక్రమార్కులకు ముచ్చెమటలు
నల్లధనం, అక్రమ లావాదేవీలపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల షెల్ కంపెనీల గుట్టురట్టు చేయాలని పలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సోదాలు ప్రారంభించిన ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ రోజు ఇద్దరు అక్రమార్కులను అరెస్టు చేసింది. భారీగా డొల్ల కంపెనీలను స్థాపించిన ధనుంజయ రెడ్డి, లియాకత్ అలీ అనే వ్యాపారులను అరెస్టు చేసినట్లు తెలిపింది. ధనుంజయ రెడ్డి బెంగళూరుకు చెందిన వ్యక్తని, నకిలీ ధ్రువ పత్రాలతో 20కి పైగా డొల్ల కంపెనీలను స్థాపించాడని పేర్కొంది.
యునైటెడ్ బ్యాంకు సహా పలు బ్యాంకుల్లో ఆయన రూ.70 కోట్లు తీసుకున్నాడని ఈడీ తెలిపింది. బ్యాంకులకు హామీగా ఇచ్చిన పత్రాలు కూడా నకిలీవేనని తేల్చింది. ధనుంజయ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈడీ వేగంగా చర్యలు తీసుకుంటుండడంతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ED arrests G D Reddy and K Liakath Ali in separate cases during follow up action against shell companies
— ED (@dir_ed) April 4, 2017