: జగన్ కు అసలు ఆ అర్హత ఉందా?: యనమల


12 కేసులకు సంబంధించిన చార్జ్ షీట్లలో ప్రధమ ముద్దాయిగా ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, గవర్నర్ ను కలిసి, రాజ్యాంగం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. రాజ్యాంగం, షెడ్యూల్ 10పై జగన్ కు గౌరవం ఉందా? అని ప్రశ్నించిన యనమల, దేశంలో ఇన్ని చార్జ్ షీట్లు ఉన్న విపక్ష నేత ఎవరూ లేరని అన్నారు. అసలు రాజ్యాంగంపై గౌరవం ఉంటే, ఇన్ని కేసులున్న జగన్, ప్రతిపక్ష నేత పదవినే తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. తొలుత తాను విపక్ష నేతగా రాజీనామా చేసి, ఆపై విలువల గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News